అందరి జీవితంలో ఒక కథ వుంటుంది!

24 ఏళ్ళ ఒక కుర్రాడు రైలు కిటికీ నుండి చూస్తూ..”నాన్న చెట్లు వెనక్కి వెళ్తున్నాయి” తండ్రి ఒక చిరునవ్వు నవ్వాడు..కాని పక్కనే ఉన్న ఒక యువ జంట ఆశ్చర్యంగా ఆ కుర్రడి వేపు చూస్తున్నారు. మల్లీ ఆ కుర్రడు “నాన్న! మబ్బులు చూడు అవి మనతోనే వస్తున్నాయి అని అరిచేసరికి..ఆ యువ జంట – మీ పిల్లాడిని మంచి హాస్పిటల్ లో చుపించకపోయార అని ఆ కుర్రడి తండ్రి తో అనగా దానికి ఆయన “ఇప్పుడే హాస్పిటల్ నుండి వస్తున్నాం. మా అబ్బాయి పుట్టుకతో గుడ్డివాడు..ఈరోజే కళ్ళు వచ్చాయి అని అన్నారు.

ఈ భూమి మీద అందరికి ఏదొక కధ వుంటుంది. ఎవరి గురించి తెలియకుండా ముందే వాళ్ళ మీద ఒక నిర్దారణకు రావద్దు. నిజం తెలిసాక మిమల్ని ఆశ్చర్యపరుస్తాది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *