ఓ డాక్టర్ కథ! ఎవరినీ ఒక అంచనా వేయద్దు

ఓక అబ్బాయికి అత్యవసర శస్త్రచికిత్స చేయడం కోసం ఒక డాక్టర్ గారు కంగారు కంగారుగా ఆస్పత్రికి చేరుకున్నారు. చేరగానే తన దుస్తులను మార్చుకొని నేరుగా శస్త్రచికిత్స గది కి వెళ్ళారు. అక్కడ ఆ అబ్బాయి తండ్రి అ డాక్టర్ గారు రాగానే మీరు రావటానికి ఇంత సమాయం ఎందుకు తీస్కున్నారు? మీకు తెలీద మా బాబు ప్రాణం చావుబతుకులో ఉందని? మీకు బాధ్యత ఏమన్నా ఉందా?

డాక్టర్ గారు అది విన్నాక చిన్న నవ్వు నవ్వీ “నన్ను క్షమించండి! నాకు సమాచారం వచ్చిన సమయం లో ఆస్పత్రి లో నేను లేను. నాకు సమాచారం అందిన వెంటనే వేగంగా వచ్హాను.మీరు కొంచెం సాంతిస్తే నా పని నేను చేస్కుంట.” అని అన్నారు.

దానికి అయన “ఏంటి నేను శాంతంగా ఉండాలా? మీ బిడ్డ ఇదే గదిలో ఉంటె మీరు శాంతంగా ఉంటారా? మీ స్వంత బిడ్డ చనిపోతే, మీరు ఏమి చేస్తారు?” అని గట్టిగ అరిచాడు.

డాక్టర్ గారు మల్లీ చిన్న చిరునవ్వు నవ్వీ, “నేను పవిత్ర గ్రంధం లో ఏముందో ఒకటి చెప్తాను..మనం మట్టి నుండి వచ్చాం, మల్లీ మట్టి లోకే వెళ్తాము, దేవుని నామము ఆశీర్వదింపబడును!..వెళ్లి మీ కుమారూడి కోసం ప్రార్దన చేయండి.”

దానికి అయన “సలహాలు ఇవ్వటం చాల సులభం” అని అనుకుంటూ వెళ్ళాడు. కొన్ని గంటల తర్వాత డాక్టర్ గారు బయటకి వచ్చి “థాంక్ గాడ్! మీ కుమారుడు రక్షించబడ్డాడు..మీకు ఎమన్నా సందేహాలు వుంటే నర్స్ ని అడగండి” అని అంటూ..” వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు.

“అతను ఎందుకంత గర్వంగా ఉన్నాడు? అతను కొంచెం సేపు కూడా అగలేకపోయాడ? నా కొడుకు గురించి వివరాలు తెలుసుకుందాం అనకున్నా”..అని అప్పుడే చికిత్స గది నుండి వచ్చిన నర్స్ తో అన్నాడు.

అది విన్నా నర్స్ తన కంటి నుండి నీరు వస్తుండగా అతనితో “డాక్టర్ గారి కుమారుడు నిన్న రోడ్ ఆక్సిడెంట్ లో చనిపోయాడు. మీ కుమారుడి శస్త్రచికిత్స కోసం మేము ఫోన్ చేసినప్పుడు ఆయన తన కుమారుడి అంత్యక్రియల్లో ఉన్నారు.విషయం తెల్సిన మరుక్షణం అక్కడనుండి బయల్దేరి వచ్చి మీ బాబు ని కాపాడారు. ఇప్పుడు అయన తన కొడుకు అంత్యక్రియలు పూర్తి చేయటానికి వెళ్తున్నారు.” ఇలా అన్నది.

ఎవరినీ ఒక అంచనా వేయద్దు..ఎందుకంటే వారి జీవితం ఎలా ఉందొ, వారు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి.

One thought on “ఓ డాక్టర్ కథ! ఎవరినీ ఒక అంచనా వేయద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *