పసల బేబీని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న రఘు కుంచె!

ఏ.ఆర్ రెహ్మాన్ 1994 లో శంకర్ దర్సకత్వం లో విడుదలైన “ప్రేమికుడు” సినిమాకి  సంగీతం సమకూర్చారు. ఆ పాటలు ఎంత బాగుంటాయో చెప్పనక్కర్లేదు. ప్రేముకుడు సినిమా లో “ఓ చెలియా నా ప్రియసఖియా” అనే పాటని ఇటీవలే  పసల బేబీ అనే ఒక మహిళ పాట పాడుతూ సోషల్ మీడియా లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈమె రంగంపేట మండలం వడిశలేరుకి చెందినా బేబీ కి సంగీతం రాదు కానీ సోషల్ మీడియా లో ఆమె పడిన పాట మన అందరికి నచ్చింది.  ఏ.ఆర్. రెహ్మాన్ తన ఫేస్బుక్ పేజి లో ఆమె పాత పోస్ట్ చేసి మెచ్చుకున్నారు. దీంతో ఆమె వీడియోక  ఇంకొంచెం వైరల్ అయింది. ఇటివలే సంగీత దర్శకుడు కోటి తో కలిసి మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో చిరంజీవి గారు అలాగే సురేఖ గారు ఎంతగా మెచ్చుకున్నారో తెలిసిందే.

ఇదిలావుండగా ఈ రోజు రఘు కుంచె అయన ఫేస్బుక్ లో “నేను అక్టోబర్ నెల 29న వడిశలేరు బేబీ గారి వీడియో చూసినప్పుడే ఈమెను తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేయాలనే ఆలోచన కలిగింది. ఆవిడని పరచయం చేస్కొని పాట రికార్డింగ్ కి సిద్దం అవ్వమని  చెప్పి, అప్పుడే నిర్ధారించిన కొత్త సినిమా “పలాస 1978” కి సంభందించిన దర్శక నిర్మాతులని ఒప్పించి ఆఘ మేఘాల మీద లక్ష్మీ భూపాల తో పాటని రాయించాను. ఆ పాట పనులు అవుతుండగా…వెంటనే ఇంకో ఆలోచన తట్టింది. అసలు ఆమె జీవితానికి సంబందించిన ఒక పాత చేస్తే ఎలా ఉంటుంది?  చాలా మందికి స్పూర్తిగా ఉంటుంది కదా అని అనిపించి ,వెంటనే లక్ష్మీ భూపాల కి చెప్పగానే , ట్యూన్ పంపు అన్నాడు .. పదిహేను నిమషాల్లో  నేను ట్యూన్ పంపగా  45నిమిషాల్లో లిరిక్స్ పంపాడు .. కళ్ళమ్మట నీళ్లు వొచ్చాయి ఆ లిరిక్స్ చూడగానే.. థాంక్ యు లక్ష్మీ భూపాల…ఆ పాటని త్వరలోనే మీ ముందుకు తెస్తున్నాను … ఈ లోపు ఆ పాట ప్రయాణానికి సంబందించిన చిన్న ఇంటరెస్టింగ్ క్లిప్ చూడండి” అంటూ పోస్ట్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *