సిరిధాన్యలు అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

చిరుధాన్యాలు ఆరోగ్యానికి సిరిధాన్యలు. ఈ సిరిధాన్యాలు పూర్వకాలంలో నుండి వాడుకలో ఉన్నవే, కానీ క్రమేపీ మన ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పు కారణంగా వీటి స్థానాన్ని బియ్యం, గోధుమలు భర్తీ చేసాయి.

డా. ఖాదర్ వలి గారు ఈ చిరుధాన్యాల మీద అధ్యయనం చేసి వాటి యొక్క రోగనిరోధక శక్తి, సుగుణాలను ప్రపంచానికి తెలియచెప్పడం ద్వారా ఇవి మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చాయి.

వీటిలో ఉండే అత్యంత పోషక విలువలు మన రోగనిరోధక శక్తి ఎదుగుదలకు సహాయపడి ఎలాంటి జబ్బులను దరిచేరనివ్వవు.

అసలు చిరుధాన్యాలు అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు, మొక్కజొన్నలు, కొర్రలు, ఊదలు, సామలు, అరికలు, అండుకొర్రలు మొదలుగున్నవి.

ఈ చిరుధాన్యాలను రెండు రకాలుగా విభజించారు.

  1. పాజిటివ్ ధాన్యాలు
  2.  న్యూట్రల్ ధాన్యాలు

పాజిటివ్ ధాన్యాలు అంటే కొర్రలు, ఊదలు, సామలు, అరికలు, అండుకొర్రలు.
న్యూట్రల్ ధాన్యాలు అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు, మొక్కజొన్నలు.

న్యూట్రల్ ధాన్యాలను ఆరోగ్యంగా ఉన్నవారు తీసుకోవచ్చు, కానీ వయస్సు పెరిగే కొద్దీ వీటి వాడకం తగ్గించాలి. ఎందుకంటే భవిష్యత్తులో రోగాలను రాకుండా ఆపే శక్తి పాజిటివ్ ధాన్యాలకు మాత్రమే ఉంది.

పాజిటివ్ ధాన్యాలలో ఉండే పీచుపదార్థాల శాతం

కొర్రలు – 8%
అరికలు – 9%
సామలు – 7.6%
ఊదలు – 10.1%
అండుకొర్రలు – 12.5%

ఈ ఐదు ధాన్యాలలో ఉండే పీచుపదార్ధం మిగిలిన వాటికన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ పీచుపదార్ధం కార్బోహైడ్రేట్ ని చుట్టుకొని ఉండటం వలన అది ఒకేసారి అరగకుండా నెమ్మదిగా అరిగి మనకి విడతల విడతలుగా శక్తిని అందిస్తుంది. దానితో మనం రోజంతా ఎంతో ఉత్సాహంతో, చురుకుదనంతో ఉంటాం. అధిక పీచుపదార్ధం కలిగిన ఆహారాన్ని సేవించడం ద్వారా మన రక్తానికి అవసరమయ్యే గ్లూకోజ్ శాతాన్ని నెమ్మదిగా అందిస్తుంది.

బియ్యాన్ని ఉపయోగించే విధంగానే చిరుధాన్యాలను కూడా వాడవచ్చు, కాకపోతే రెండు గంటలు ముందుగా నానబెట్టుకోవాలి. వీటితో ఉప్మా, ఇడ్లీ, దోస, గంజి మొదలుగునవి అన్నీ చేసుకోవచ్చు. వీటి రెసిపీలు యూట్యూబ్లో పొందుపరచి ఉన్నాయి.

వీటి ప్రాముఖ్యత తెలుసుకొని ఎంతోమంది అధిక స్థూలకాయం, బీపీ, మధుమేహ వ్యాధులను తగ్గించుకున్నారు.

ఈ ధాన్యాలను సేవించేటప్పుడు పంచదార, గోధుమలు, మాంసాహారాన్ని నివారిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.

వీటి విలువలు, విశిష్టతను, శక్తిని తెలుసుకొని మన ఆహారపు అలవాటుగా మార్చుకుందాం.

ఈ చిరుధాన్యాలను మన తరువాతి తరానికి గొప్ప బహుమతిగా అందిద్దాo.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *