తిప్పతీగ – భగవంతుడు మనకు ప్రసాదించిన సంజీవని!

మన తిప్పలను తొలగించడానికి భగవంతుడు ప్రసాదించిన సంజీవని ఈ తిప్పతీగ. దీనిని అమృత, మధుపర్ని అని కూడా పిలుస్తారు. తిప్పతీగ చూడటానికి తమలపాకులా హృదయ ఆకారంలో ఉంటుంది.

కామెర్లు, మొలలు వంటి వ్యాధులను తరిమికొట్టి, రక్తాన్ని శుద్ధి చేసి, ఇమ్యూనిటీ స్థాయిని పెంచే గొప్ప ఔషధ గుణాలు దీనిలో ఉన్నాయి.

ఇది ఎయిడ్స్ వంటి మహమ్మారితో పోరాడి దాని తీవ్రతను తగ్గించే శక్తి ఉన్న ఔషధి.

ఈ మూలిక మధుమేహం మరియు మూత్రకోసం లోని రాళ్లను తగ్గించి అనేక రకాల వైరల్ జ్వరాల నుండి మన శరీరాన్ని పరిరక్షిస్తుంది.

తిప్పతీగ కషాయం మోహం పై నల్లటి మచ్చలు, మొటిమలు, వాంతులు, జలుబులను తగ్గించి, జ్ఞాపకశక్తిని పెంచి, దీర్ఘకాలం ఆరోగ్యంగా బ్రతకడానికి శక్తినిస్తుంది.

తిప్పతీగను అతిగా వాడకుండా మితంగా వాడితే ఔషధంలా పని చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *