గోంగూర చేసే మేలు! రామబాణం లాంటిది

గోంగూర తెలుగు వారికి సుపరిచయమైన ఆకుకూర. గోంగూర పచ్చడికి తెలుగురాష్ట్రాలలో ఎంతో డిమాండ్ ఉంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.

గోంగూరలో ఐరన్, పొటాషియం, విటమిన్ ఎ, బి1, బి2, బి9, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, కాల్షియమ్, యాంటీ ఆక్సిడెంట్లు, మరెన్నో పోషక పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి.

గోంగూరలో ఉండే విటమిన్ ఎ కంటి సమస్యలను పోగొట్టి మన కంటి చూపును మెరుగు పరచి రేచీకటిని దూరం చేస్తుంది.

గోంగూరలోని పొటాషియం రక్త సరఫరా వ్యవస్థను క్రమబద్ధం చేసి గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహ సమస్యలను నివారిస్తుంది.

ఇందులోని ఫోలిక్ యాసిడ్ కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడుతుంది.

దీని పేస్ట్ తలకి పట్టించడం ద్వారా జుట్టు రాలే సమస్య పరిష్కారమవడమే కాక బట్ట తలను కూడా తగ్గిస్తుంది.

ఎముకలు గట్టిపడటానికి మరియు దంతాలు బలంగా మారడానికి దీనిలో ఉండే కాల్షియమ్ తోడ్పడుతుంది.

గోంగూరలో ఉండే అద్భుతమైన ప్రోటోకాచెక్ యాసిడ్ రోగాలను కలిగించే ధనాత్మక కణాలను బయటకు పంపి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

గోంగూరని వేయించినా, ఉడికించినా, పొడిచేసినా సరే వాటి యొక్క పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ బయటకు పోకుండా మనకి జబ్బులు రాకుండా కాపాడుతాయి.

గోంగూర కషాయం స్త్రీల ఆరోగ్య సమస్యలకు రామబాణం లాంటిది. వారు దీనిని 21 రోజుల పాటు తీసుకుంటే గర్భకోసంలో గడ్డలు, ఫైబరోయిడ్స్, మూతి మీద మీసాలు, హార్మోన్ల అసమతూలనం మొదలైన సమస్యలు అన్నీ పరిష్కారమవుతాయి.

గోంగూర యొక్క దివ్యౌషధాల విశిష్టతను తెలుసుకొని దానిని మన ఆహారపు అలవాటుగా మార్చుకొని ఆరోగ్యంగా జీవిద్దాం.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *