పశువులలో వచ్చు వ్యాధులు – పశువైద్య శాస్త్రము

పశువులలో వచ్త్చే వ్యాధులు, వాటి యొక్క వ్యాప్తి, వ్యాధి కారకాలు లక్షణాలు నిర్ధారణ, చికిత్స, నివారణ మొదలగు వివరములను తెలిపే శాస్త్రమును ‘’పశువైద్య శాస్త్రము’’ అని అందురు. పశువ్యాధులను అనేక విధములుగా వర్గీకరించిరి. ముఖ్యముగా ఈక్రింది తెలిపిన విధముగా వర్గీకరణ చేసితిరి.

 1. వ్యాధి యొక్క వ్యాప్తి ననుసరించి;
 2. అంటువ్యాధులు (Contagious Diceases);- ఈవ్యాదులు ఒక పశువు నుండి మరియోక పశువునకు వ్యాప్తి చెందును. ఈవిధముగా చాలా తీవ్రముగా పశువులకు వ్యాప్తి చెందుతాయి. అందువలన వీటిని ‘’అంటువ్యాధులు’’ (Coutagious Diceases) గా పేర్కొనిరి. ఉదా; గొంతువాపు వ్యాధి, దొమ్మ వ్యాధి మొదలగునవి. వ్యాధులు సాదారణంగా సూక్ష్మజీవులు, వైరస్, శిలీంద్రములు  మొదలగు వాటిచే కలుగును.
 3. అంటువ్యాధులు కానివి;-(Non – Contagious Diseases) ఈవ్యాదులు, వ్యాధి వచ్చిన పశువులకు మాత్రమే పరిమితమై యుండి ఇతర పశువులకు నేరుగా వ్యాధి కలిగించలేవు. ఉదా; పొదుగు వాపు వ్యాధి (Mastitis).
 4. జూనోటిక్ వ్యాధులు; ఈవ్యాదులు పశువుల నుండి మనుష్యులకు, మనుష్యుల నుండి పశువులకు వ్యాప్తి చెందు తీవ్రమైన వ్యాధులు. ఉదా; దొమ్మ వ్యాధి, రేబిస్, బ్రూసిల్లోసిస్ అను కొన్ని వ్యాధులు.

II  వ్యాధి యొక్క వ్యాప్తి విధానము ననుసరించి;

 1. ఎండమిక్ (Endemic);- ఈ రకమైన వ్యాధులు సాదారణంగా ఒకే ప్రదేశంలో అప్పుడప్పుడు (Seasonally) అదే సమయంలో మరల మరల వస్థూ వుంటాయి. అనగా ఆ జబ్బులు ఆ ప్రదేశమునకు చాలా కాలం వుండి తరచూ కన్పిస్తాయి. అందువలన ఈవ్యాధులకు (ఎండమిక్) ఎండమిక్ వ్యాధులు అని అందురు.
 2. ఎపిడిమిక్ వ్యాధులు (Epedimic);- ఈ వ్యాధులు చాలా తీవ్రంగా ఒక ప్రదేశము నుండి మరియొక ప్రదేశమునకు త్వరగా వ్యాప్తి చెందుతాయి. మరియు మరణముల సంఖ్య ఎక్కువగా యుండి అనేక ప్రదేశములలో పశువులకు ఈ వ్యాధులు వస్తాయి. గాలి ద్వారా కాని, కలుషిత నీటి ద్వారా కాని ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.

ఉదా; గాలి కుంట్ల వ్యాధి, మొ. వ్యాధులు.

 1. పాండమిక్ వ్యాధులు (Padamic);- ఈ వ్యాధులు తీవ్రంగా ఒక దేశము నుండి మరొక దేశమునకు వ్యాప్తి చెందుతాయి. పశువులను ఇతర దేశాల నుండి కొనుగోలు చేయుట, ఇతర దేశముల నుండి వచ్చు మనుష్యుల ద్వారా ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అదియే కాకుండా ఇతర దేశముల నుండి దిగుమతి చేసుకున్న వీర్య నాళికల ద్వారా, మరియు పిండముల ద్వారా (Embryos) కూడా ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఉదా; I.B.R.T (ఎర్రముక్కు వ్యాధి) మొ. వ్యాధులు.

ఈ పైన తెలిపిన వర్గీకరణము కాకుండా వ్యాధి కారకము ననుసరించి వ్యాధులను ఇంకనూ వర్గీకరణము చేసితిరి. అని ఈ క్రింది విధముగా చేసితిరి.

 1. సుక్ష్మ జీవుల వల్ల వచ్చు వ్యాధులు (BACTERIAL DISEASES)
 2. వైరస్ ల వల్ల వచ్చు వ్యాధులు (VIRAL DISEASES)
 3. శిలీంద్రముల వల్ల వచ్చు వ్యాధులు (FUNGAL DISEASES)
 4. అంతర్గత ఏకకణ పరాన్న జీవుల వల్ల వచ్చు వ్యాధులు (PROTOZOAN DISEASES)
 5. పరాన్న జీవుల వల్ల వచ్చు వ్యాధులు అంతర పరాన్న జీవుల వల్ల వచ్చు వ్యాధులు, బాహ్య పరాన్న జీవుల వల్ల వచ్చు వ్యాధులు,
 6. జీర్ణ పక్రియలో లోపాల వల్ల వచ్చు వ్యాధులు (METABOLIC DISORDERS)
 7. సాధారణ వ్యాధులు (GENERAL DISEASES)
 8. ప్రత్యుత్పత్తిలో లోపాల వల్ల వచ్చు వ్యాధులు (REPRODUCTIVE PROBLEMS)
 9. ఆహార లోపాల వల్ల వచ్చు వ్యాధులు (NUTRITIONAL DISORDERS)

సూక్ష్మ జీవుల వల్ల వచ్చు వ్యాధులు (Bacterial Diseases);

సూక్ష్మ జీవ శాస్త్రము (Micro Biology):

పశువులలో వచ్చు అంటు వ్యాధులకు కారకములయిన సూక్ష్మ జీవుల గురించి తెలిపే శాస్త్రమును ‘’సూక్ష్మ జీవ శాస్త్రము’’ (Micro Biology) అని అందురు. ఈ శాస్త్రములో అంటువ్యాధులు వాటికి కారణములు, వ్యాధి నిర్ధారణ, పశువులపై వాటి యొక్క ప్రభావము, నివారణ చికిత్స మొదలగు అంశములను గూర్చి విశదముగా యుండును. వాటిని గూర్చి మనము తెలుసుకొంటాము.

cattle-diseases-cow-cure-prevention-notesపూర్వకాలములో పశువులలో వచ్చు వ్యాధులపై మన పూర్వీకులకు సరైన అవగాహన లేదు. ఎందువలన అనగా వాటిని పరీక్షించుటకు సరి అయిన పరికరములు శాస్త్రీయ విజ్ఞానము లేదు. అందువలన సూక్ష్మ జీవుల యొక్క ఉనికి, మొదలగు విషయములను తెలుసుకొన లేకపోయారు. మరియు అవి మన కంటికి కనిపించని అతిచిన్న సూక్ష్మ జీవులు. కాల క్రమేణా సూక్ష్మ దర్శిని (Microscope) కనుగొన్న తరువాత వీటిపై చాలా పరిశోదనలు జరిపి వాటి గురించి సంపూర్ణంగా తెలుసుకోన గలిగారు. సూక్ష్మ జీవుల యొక్క జీవ ధర్మాలను, ప్రత్యుత్పత్తి, బౌతిక లక్షణాలను మొదలగు అంశములపై పూర్తీ వివరాలను తెలుసుకోన గలిగారు. ఈ ఘనత ‘’లూయీపాక్చర్’’ కే దక్కుతుంది. వ్యాధులు చాలా వరకు సూక్ష్మ జీవుల వల్లే కలుగుతాయని రుజువు చేయగలిగాడు. (Bacteria). అందువలనే లూయీపాక్చర్ ను ‘’సూక్ష్మ జీవ శాస్త్ర పితామహుడు’’ (Father of modern micro biology) అని పిలిచెదరు. దీనికి తోడ్పడిన సుక్ష్మ దర్శిని గురించి కొంత తెలుసుకొందాం.

           సూక్ష్మ దర్శిని (Micro Scope): ఈ పరికరము ద్వారా మన కంటికి కనిపించని సూక్ష్మ భాగములను మనము చూడగలము. సాదారణ సూక్ష్మ దర్శిని వస్తువులను 1000 రెట్లు పెద్దది చేసి చూపించగలదు. వీటి సహాయంతో సుక్ష్మ జీవుల యొక్క సారూప్యత, ప్రత్యుత్పత్తి, పరిణితి చెందు విధానములు మొదలగు అంశములను విపులంగా తెలుసుకోగిలిగారు.

 1. సూక్ష్మ జీవులు (బాక్టీరియా): ఇవి ఏకకణ జీవులు, ఏకకణ జీవులు అయిననూ జీవ కార్యములన్నియూ (ఎదుగుదల, ఆహారమును జీర్ణము చేసుకొనుట, ప్రత్యుత్ప్టత్తి మొదలగు కార్యక్రమములను స్వతంత్రముగా నిర్వర్తించగలవు. వీటిలో అనేక రకములయిన సూక్ష్మ జీవులను గుర్తించారు. వాటి యొక్క లక్షణాలను అనుసరించి వాటిని వర్గీకరించిరి. ఈ సుక్ష్మ జీవులు రెండు రకములుగా యుండును.

1 వ్యాధులను కలుగ జేయు సూక్ష్మ జీవులు (Pathogamic Bacteria)  

2 వ్యాధులను కలుగ చేయని సూక్ష్మజీవులు (Non Pathogamic Bacteria)

సుక్ష్మ జీవులు అన్నియూ ఒకే రకముగా ఉండవు. అవి కలుగ చేసే వ్యాధులు రకరకాలుగా యుంటాయి. కొన్ని చలనము కల్గి యుంటాయి. సుక్ష్మ జీవులు రెండు రకాలైన విషపదార్ధాలను ఉత్పత్తి చేస్తాయి.

 

1 ఎండో టాక్షిన్స్: ఇది సూక్ష్మ జీవుల యొక్క కణజాలములో ఉత్పత్తి అయి అవి           చనిపోయిన తర్వాత శరీరంలోకి విడుదల అవుతాయి. అందువలన వీటి ప్రభావం స్ధానికంగానే యుండును. (Localozed action) (Endotoxins).

2 ఎక్సో టాక్షిన్: (Exotoxins):- ఇవి సూక్ష్మ జీవులు ఉత్పత్తి చేసి రక్త ప్రవాహంలోనికి విడుదల చేస్తాయి. వీటి ప్రభావం శరీరం అంతటా వ్యాపిస్తుంది.

   కొన్ని సూక్ష్మ జీవులు ఈ రెండు రకములైన విష పదార్ధాలను (toxins) ఉత్పత్తి చేస్తాయి.                                                                                          ఈ సుక్ష్మ జీవులు అన్ని ఒకే రకముగా వుండవు. వీటికి కేంద్రకము వుండదు. వీటి ఆకృతి (Morphology)లో తేడాలు వుంటాయి. వీటి ఆకృతిని బట్టి మరియొక రకముగా వర్గీకరణ చేసితిరి. అవి ఏమనగా

 1. గుండ్రటి ఆకారం (Cocci) ఇవి గుండ్రటి ఆకారంలో వుండి కొన్ని విడిగాను మరి కొన్ని గొలుసు ఆకారంలోనూ వుంటాయి. (Sheptococci). కొన్ని గుంపులుగా వుండి ద్రాక్ష పళ్ళ గుత్తులు వలె వుంటాయి. (Staphylo Cocci)
 2. కడ్డి ఆకారం (Bacillus) వుండి పుల్ల ముక్కలవలె వున్న వాటిని బాసిల్లస్ అని అందురు.
 3. కామా ఆకృతిలో వున్న సుక్ష్మ జీవులను “విబ్రియో” అని అంటారు.
 4. స్ప్రింగు ఆకారంలో వున్న సుక్ష్మ జీవులను “స్పైరుల్లా” అని అంటారు.
 5. సన్నటి దారపు పోగువలె వున్న వాటిని “స్పైరోకేట్స్” (Spirochetes) అని అంటారు.

 

 1. Bacillus కడ్డి ఆకారం. స్టేఫిలోకోకై (Staphylococci)
 2. ద్రాక్ష పళ్ళ గుత్తి ఆకారం గుంపులుగా
 3. గొలుసు వలే వున్న గుండ్రటి సుక్ష్మ జీవులు (Streptococci)
 4. కామా ఆకారం (విబ్రిమో) (Vibriyo) 5. బైపోలార్ క్రిములు
 5. స్ప్రింగు ఆకారం (Spirulla)      7. దారపు పోగులవలె వున్నవి (Spirocheetes)

శరీరంలో కాని, శరీర అవయముల్లో కాని, రక్తంలో కాని, జీర్ణ, శ్వాశ కోశాలలో కాని ఈ సూక్ష్మ జీవులు అభివృద్ధి చెంది వ్యాధులను కల్గిస్తాయి. వీటిని శరీర అవయముల నుండి కాని, శరీరము నుండి వచ్చు స్రావముల నుండి గాని, రక్త నమూనాల నుండి కాని, నమూనాలను సేకరించి ప్రయోగశాలలలో పరీక్షించి అవి ఏరకమైన సూక్ష్మ జీవులో తెలుసుకొందురు. మరియు వాటి యోక్క ధర్మములను తెలుసుకొందురు. వాటిపై ఏమందులు ఎక్కువ ప్రభావము చూపుతాయో మరియు నిరోధించు మందులను కూడ తెలుసుకొండురు. వాటి నుండి పశువులకు రక్షణ కల్పించుటకు ‘’వాక్షేన్స్’’ ను (టికా మందులు) కూడా ఉత్పత్తి చేయుదురు. మరియు ఈ సుక్ష్మ జీవులను అభిరంజితము చేసి (గ్రామ్స్ స్టయిన్) గ్రామ్ – ve, గ్రామ్ +ve గాను కూడా విభజించిరి. ఈవిధంగా అభిరంజితము చేసినపుడు ఎరుపుగాను, మరికొన్ని గులాభి రంగు గాను కనిపిస్తాయి. ఎరుపుగా కనిపించిన గ్రామ్ +ve గాను, గులాభి రంగు లో కనిపించిన గ్రామ్-ve గాను విభజించిరి. కొన్ని సూక్ష్మ జీవులు ఆక్సిజను లేకుండా కూడా బ్రతుక గలవు. వీటిని ‘ఎనిరోబిక్’ బ్యాక్టీరియా అని అందురు. కొన్నిటికి ఆక్సిజను అవసరము ఉండును. ఇవి ఆక్సిజను (ప్రాణవాయువు) లేకుండా బ్రతకలేవు. (Aerobic ఎయిరోబిక్). వీటిని ఎయిరోబిక్ బాక్టీరియా అని అందురు.

కొన్ని సూక్ష్మ జీవులు చలనము కలిగి, మరికొన్ని చలనము లేకుండా కూడా ఉండును. (Motile, Non -Motils). మరి కొన్ని సూక్ష్మ జీవులు స్పోరుస్ను (విత్తనములు) ఉత్పత్తి చేసి ప్రతి కూల వాతావరణములో కూడా జీవించి వ్యాధులను కలుగ చేయగలవు. మరికొన్ని విత్తనములను ఉత్పత్తి చేయలేవు. (Spore Bearing, Non – Spore Bearing) (Spores: సిద్ధ బీజకణములు)

 1. వైరస్ (Virus) సూక్ష్మాతి సూక్ష్మ జీవులు: సృష్టిలో అతిచిన్నదైనవి సూక్ష్మ జీవులు. వీటిని పరీక్షించుటకు సాధారణ మైక్రోస్కోపు నకు సాధ్యము కాదు. అందువలన “Electron Microscope” ఎలక్ట్రాన్ మైక్రోస్కోపును ఉపయోగించి చూడవచ్చును. వీటి కేంద్రములో (Nucleas) నూక్లియిక్ యాసిడ్ వుంది, దాని చుట్టూ బాహ్య పొర వుంటుంది. ఈపోర మీద వున్న “పెప్లోమియర్సు ద్వారా లైంగిక విధానము ద్వారా అభివృద్ధి చెందుతాయి. ఈవైరస్ లు నిచ్చలముగా యుండి వివిధ కొలతల్లో వుంటుంది. వీటికి ప్రత్యేకమైన కణ నిర్మాణము వుండదు. DNA కాని RNA కాని కేంద్రములో ఉండును. ఈవైరస్ లు పశువులలో చాలా తీవ్రమయిన వ్యాధులను కలుగ జేస్తాయి.

ఉదా: Foot & Mouth (గాళ్ళు, సంచలు) మరియు రేబిస్. ఇవి రోగి యోక్క కణజాలము లలో ప్రవేశించి ఆ కణములను నాశనం చేస్తాయి. వైరస్ లను నిర్మూలం చేయు మందులు లేవు. కాని రిట్రోవైరల్ మందులు వాటి యొక్క ఉత్పత్తిని నిరోధించి అదుపులో వుంచగలవు. వైరస్ వ్యాధులకు వాక్సిన్స్ ను తయారు చేసి వ్యాధుల నుంచి రక్షణ కల్పించ వచ్సును. చాలా వ్యాదులకు ప్రస్తుతము వ్యాక్షీన్సు తయారు చేయుచున్నారు.

ఉదా: Foot & Mouth (గాళ్ళు) Rabies (పిచ్చి వ్యాధి) కుక్కలలో వచ్చు Distemper వ్యాధి. ఈవైరస్ లు ఉత్పత్తి చేయుటకు జీవముతో యున్న కణజాలములు కావలయును. అందువలన ఇవి “Living Cells” లోనే ఉండగలవు. కాని బాక్టీరియాలు మృత కళేబరము లలో కూడా బ్రతక గలవు. వైరస్ లు యాంటీ బయోటిక్స్ మందులకు లొంగవు. రిట్రో వైరల్ మందుల ద్వారా వాటి యొక్క ఉత్పత్తిని అదుపు చేయవచ్చును.

బాక్తీరియాలకు వైరస్ లకు గల తేడాలు:

ధర్మములు బాక్టీరియాలు వైరస్ లు
కణజాల నిర్మాణము కలదు లేదు
ఎదుగుదల మృత కళేబరముల్లో కూడా బ్రతక గలవు వైరస్ లకు జీవముతో యున్న కణముల్లోనే బ్రతక గలవు
పునరుత్పత్తి బైనరీ పిషన్ ద్వారా పెప్లోమియర్సు ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగును
DNA / RNA రెండూ ఉండును ఎదో ఒకటి మాత్రమే ఉండును
యాంటిబయోటిక్సు యొక్క ప్రభావం లోంగును పనిచేయవు

 

 1. ఏక కణ అంతర్గత పరాన్నజీవులు (Protoza): ఇవి ఏక కణ పరాన్న జీవులు. వీటికి పూర్తీ కణజాల నిర్మాణ ముండును. జీవ ప్రక్రియ జరుపగలవు. కొన్నింటికి చలనమునకు సహాయపడు సీలియాకాని, ప్లాజిల్లమ్ కాని యుండును. కొన్ని రక్తములోను, కొన్ని రక్తకణముల లోను మరియు జీర్ణ కోశ వ్య్వస్ధలోను ఉండును. బైనరీ పిషన్ ద్వారా మరియు లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా పునరుత్పత్తి చేయ గలవు.

కొన్ని జీవులు హాని చేక పోయిననూ, మరికొన్ని పశువులకు తీవ్రమయిన వ్తాధులు కలుగ జేస్తాయి.

ఉదా: ధైలీరియాసిస్, బెబిసియేసిస్, కాక్సీడీ యాసిస్ మొదలగునవి.

అంటువ్యాధులను అదుపు చేయు పద్దతులు:

 1. దూడ పుట్టిన వెంటనే బొడ్డును 4 అంగుళముల దిగువున స్తేరిలైజు చేయబడిన దారముతో కట్టి, దిగువున కత్తిరించి తీసివేయాలి. తర్వాత కత్తిరించిన భాగము మీద టించరు అయోడిన్ కాని, బొరిక్ ఆమ్లమును కాని అద్ది 6 అంగుళముల వెడల్పు గల శుబ్రమైన గుడ్డను తీసుకొని బొడ్డు మీద నుంచి తీసి నడుము పైభాగమున కట్టి ఉంచాలి. బొడ్డు మాను వరకు అనగా సుమారుగా 4 – 5 రోజులు ఆకట్టును వుంచవలెను. దీని వలన సుక్ష్మ జీవులు బొడ్డు ద్వారా శరీరం లోకి ప్రవేశించ లేవు. అనేక వ్యాదులు రాకుండా కాపాడవచ్చును. (బొడ్డు వాపు, కీళ్ళవాపులు).
 2. దూడలకు పుట్టిన 1 – 2 గంటల లోపుల ముర్రుపాలు త్రాగించాలి. ఆలస్యం చేస్తే ముర్రుపాలలో వుండే వ్యాధి నిరోధక శక్తిని కలిగించే కణాలను దూడ మొక్క ప్రేగులో వుండే శోషణ శక్తి తగ్గిపోతుంది. దీని వలన వ్యాధి నిరోధక శక్తి కల్గును.
 3. దూడ పుట్టిన 10 రోజుల్లో మొదటిసారిగా ఏలిక పాముల మందు వేయాలి. తదుపరి ప్రతి నేలకు ఒకసారి చొప్పున 6 మాసాలు వయస్సు వచ్చేవరకూ వేయించాలి.
 4. 3 – 4 మాసాలు వయస్సు నుంచి ప్రారంభించి దూడలకు టీకా మందులు వేయించాలి. (వ్యాధి నిరోధక టీకాలు).
 5. 6 – 8 మాసాల వయస్సులో ధైలీరియాసిస్, బ్రుసిల్లోసిస్ వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి.
 6. కొత్త పశువులను కొనుగోలు చేయునపుడు అంటువ్యాధులు లేని వాటినే కొనుగోలు చేయాలి. ముందు జాగ్రత్తగా పరీక్షలు చేసి కొనాలి. కొన్న వెంటనే పాతపశువులతో కలుపరాడు. 2-3 నెలల వరకూ వాటిని విడిగా వుంచి అప్పుడు కలపాలి.
 7. వ్యాధి సోకిన పశువులను ఆరోగ్యమైన పశువుల నుండి వేరు చేయాలి. చికిత్స చేసి, మిగతా పశువులకు టీకా మందులు వేయాలి.
 8. వ్యాధితో పశువులు చనిపోయి నట్లయితే దానిని వీలైనంత దూరంగా 6 అడుగుల లోతు గొయ్యి త్రవ్వి క్రిమి సంహారక మందులు, సున్నం, ఉప్పు జల్లి పాతి పెట్టాలి. లేదా కాల్చివేయాలి.
 9. కొన్ని వ్యాధులు పిడుదులు (TICKS) గోమార్లు, ఈగలు (Flies) దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అందువలన వ్యాధులు ప్రబలకుండా వీటిని క్రిమిసంహారక మందులను ఉపయోగించి నిర్మూలించాలి. ఇవి తిరిగి వృద్ది చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
 10. పశువుల శాలలో పశువులను కిక్కిరిసి ఉంచరాదు. పశువుల శాలలో పరిశుబ్రత పాటించాలి.
 11. అంటువ్యాధులు వచ్చినపుడు దగ్గరలో వున్న గ్రామాలకు తెలియ పర్చాలి. అక్కడ పశువులకు కూడా టీకాలు వేయాలి.
 12. పశువులకు మంచి పోషక ఆహారం మరియు పరిశుభ్రమైన నీరు ఎల్లా వేళ్ళలా అందేటట్లు చేయాలి.
 13. పశువుల శాలల చుట్టూ చెట్లను నాటితే వేసవిలో ఎండ వేడిమి నుంచి కాపాడ వచ్చును.
 14. పెంట కుప్పలు, చెత్త, చెదారం పశువుల శాలలకు దూరంగా ఉంచాలి.
Summary
పశువులలో వచ్చు వ్యాధులు - Cattle Diseases in Telugu
Article Name
పశువులలో వచ్చు వ్యాధులు - Cattle Diseases in Telugu
Description
పశువులలో వచ్చు వ్యాధులు - Bacterial Diseases, Viral Diseases, Fungal Diseases, protozoan Diseases - Metabolic,General, Reproductive - Nutritional Disorders
Author
Publisher Name
Dr.GB.Haranath
Publisher Logo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *